విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన చేసిన ఉపాధ్యాయుడు కు దేహశుద్ది..!

నాగులుప్పలపాడు
మండలంలోని బి.నిడమానూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న బాలికల ప్రభుత్వ కళాశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు క్లాసులు చెప్తూ ఉండేవాడు. ఒక విద్యార్థిని పట్ల ఆ ఉపాధ్యాయుడు అనుచిత ప్రవర్తన చేశాడనే సమాచారం బుధవారం వెలుగులోకి వచ్చింది.ఆ బాలిక ఆ సమాచారాన్ని తల్లిదండ్రులుకు చేరవేయడంతోవారి బంధువులు పాఠశాలకు చేరుకొని ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు గ్రామంలో పెద్దలు ఆ ఉపాధ్యాయుడి ని పాఠశాల నుండి తీసుకు వెళ్లినట్లు సమాచారం.గతంలో ఆ ఉపాధ్యాయుడు పనిచేసిన పాఠశాలల్లో కూడా ఇలాగే విద్యార్థునీల పట్ల అనుచిత ప్రవర్తన చేసినట్లు తెలియ వస్తుంది. ఒకపక్క విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పదేపదే ఉపాధ్యాయులు నైతిక విలువలు పాటించాలని చెప్తున్నప్పటికీ ఉపాధ్యాయుల తీరులో మార్పు రావటం లేదు . ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ , పాకల, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులు కు ఉపాధ్యాయులు పాల్పడారని పోలీస్ కేసులు కూడా నమోదైన సంగతి విధితమే .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *