తురక పాలెం గ్రామంలో గురువారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రాయితీ పై ఐదు మెట్రిక్ టన్నుల పశువుల దాణాను పంపిణీ చేసారు. రాష్ట్ర నాటక రంగ అకాడమి డైరెక్టర్ బొమ్మి రెడ్డి ఓబులు రెడ్డి సర్పచి చంద్రగిరి గురువా రెడ్డి, వ్యవసాయాధికారి ప్రసాద రావు, తాళ్లూరు పశువైద్యాధికారి డాక్టర్ ప్రతాప్లు పాల్గొని పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో పశుపోషకులను ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించారు. ప్రభుత్వ పధకాలు వినియోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల కోసం వ్యవసాయశాఖ అందిస్తున్న నబ్సిడీలను, రబీలో సాగు చేయవలసిన పైర్లు, సస్యరక్షణ చర్యలు గురించి వివరించారు. 64 మంది రైతులకు దాణాను పంపిణీ చేసారు. విహెచ్ ఏ ఏడు కొండలు రైతులు పాల్గొన్నారు.
