పేద ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ సమస్తాగత నిర్మాణంపై కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐసీసీ ముఖ్య కార్యదర్శి ప్రకాశం జిల్లా పరిశీలకులు నదీమ్ జావేద్, పిసిసి సమన్వయ కర్తలు జాన్ బాబు,బివై కిరణ్,రాణి మేకల సతీష్ పాల్గొన్నారు. నదీమ్ జావేద్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సోనియాగాంధీ ఆశీస్సులతో రాహుల్ గాంధీ నేతృత్వంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని,గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మతం చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమo,అభివృద్ధిని గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో అంటకాగుతూ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని,పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగoలోని హక్కులను ఉల్లంగిస్తూ,పేద ప్రజలపై ఇష్టం వచ్చినట్లు పన్నుల భారం మోపుతూ ప్రజల కన్నీటికి కారణమవుతున్న బిజెపి తెలుగుదేశం ప్రభుత్వాలను గద్దె దింపేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ చేయి చేయి కలిపి కాంగ్రెస్ పార్టీ భలోపెతం కొరకు అందరు కృషి చేయాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నిత్యం భారత రాజ్యాంగాన్ని ఒక దైవంలా భావిస్తూ, రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగిస్తూ దేశంలో పేదరిక నిర్మూలన ఉచిత విద్యా ఉచిత వైద్యం, ఉపాది,సాగునీటి ప్రాజెక్టు లు లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి పెద ప్రజలకు అండగ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. డిసిసి అధ్యక్షులు షేక్ సైదా జిల్లాలో నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అభినందించారు. డిసిసి అధ్యక్షులు షేక్ సైదా మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలోఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి బి ఆర్ గౌస్ ,కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీపతి సతీష్ ,కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డి .సుబ్బారెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి కైపు. కృష్ణారెడ్డి, జిల్లా ఎస్ సి చైర్మన్ మన్నం. ప్రసన్న రాజు, సయ్యద్ జావెద్ అన్వర్, కే కే సి జనరల్ సెక్రటరీ సుదీర్ వర్మ, కిసాన్ సెల్ కే సుబ్బారావు, మైనార్టీ మహబూబ్ అలీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాసరి రవి తదితరులు పాల్గొన్నారు.

