ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్
చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ పి.రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తయిందని, వాటిని సిస్టంలో ఆన్లైన్ చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసును కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, జాన్సన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

