రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రియల్ టైం గవర్నెన్స్, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడు తూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ వసతి గృహాలు మరియు గురుకుల పాఠశాల లకు ప్రభుత్వం మంజూరు చేసిన కమ్యూనిటీ కాంప్లెక్స్ నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు సంక్షేమ వసతి గృహాలను రెగ్యులర్ గాతనిఖీలు చేయాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ల పనితీరును మెరుగు పరచాలని ఆయన అధికారులకు చెప్పారు. అన్నా క్యాంటీన్ లో పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంతృప్తి చెందే విధంగా పరిష్క రించాలని ఆయన అధికారులకు చెప్పారు.రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్య సేకరణ నిలుపుదల చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాల ని అధికారులకు చెప్పారు. ప్రకాశం జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.రాజబాబు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో లేట్ రబీలో వరి ధాన్య సేకరణ డిసెంబరు లేదా జనవరి మాసము నుండి నుండి ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లాలో వరి ధాన్య సేకరణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కమ్యూనిటీ కాంప్లెక్స్ పనులు వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనిఈ సందర్భంగా చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ నాయక్, ఎస్సీ,ఎస్.టి, బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

