పేద ప్రజలకు ఆర్ధికంగా అండ ఉండాలన్న ఉద్దేశ్యంతో , వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుచున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ
స్వామి అన్నారు.
గురువారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 106 మంది లబ్ధిదారులకు రూ.55.08 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆర్ధికంగా నష్ట పోరాదన్న ఉద్దేశ్యంతో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికినీ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు కొండపి నియోజకవర్గ పరిధిలో 106 మందికి 55 లక్షల 8 వేల రూపాయలు చెక్కులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 1167 మంది లబ్దిదారులకు 9 కోట్ల 4 లక్షల 32 వేల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కొండపి నియోజక వర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం పట్ల ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెల్పుతున్నట్లు మంత్రి అన్నారు. 2014-19 మద్య కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు మంత్రి తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంత మందికి ఆర్ధిక సహాయం అందించడం జరుగుచున్నదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. దీపం -2 పధకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీన ఎన్టిఆర్ భరోసా పించన్లు 4వేలు, 6వేలు, 10వేలు, 15 వేల రూపాయల వంతున సంవత్సరానికి 3వేల కోట్ల రూపాయలు అందచేయడం జరుగుచున్నదన్నారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాకు అడుగులు పడినట్లు మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
