నాగులుప్పల పాడు మండలం, హెచ్ నిడమానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు పండిట్ బక్కమంతుల వినయ్ తెలుగు పండిట్ ను విధుల నుండి తొలగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ కిరణ్ కుమార్ తెలిపారు. తెలుగు పండిట్ వినయ్ అదే పాఠశాలకు చెందిన బాలికలతో అసభ్య కరంగా ప్రవర్తించాడన్న అభియోగంపై సమగ్ర విచారణ జరిపి అభియోగములు యదార్ధమని తెలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ రాజా బాబు అదేశాల మేరకు విధుల నుండి సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి వివరించారు.
