జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరో లిఫ్టు అందుబాటులోకి రానున్నది. దివ్యాంగులకు టాయిలెట్లు, ఒకేసారి 13 మంది వినియోగించుకునేలా లిఫ్ట్ నిర్మించేలా రాష్ట్ర సాంఘిక సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం దివ్యాంగుల సంక్షేమ శాఖ నుంచి రూ.47 లక్షలను మంజూరు చేశారు. వీటిలో మొదటి విడతగా రూ.23.5 లక్షలను విడుదల చేశారు. వివిధ పనుల నిమిత్తం ప్రకాశం భవనానికి వచ్చే ప్రజలకు ఉపయోగపడేలా ఈ నిధులతో పనులు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరుకు ఆయన సూచించారు. దివ్యాంగులకు ప్రత్యేక టాయిలెట్లు, లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించేలా నిధులు విడుదల చేసిన మంత్రికి జిల్లా యంత్రాంగం కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో కలెక్టరేట్లో లిఫ్ట్ ఏర్పాటుకు సహకారం అందించిన విషయం తెలిసిందే. ప్రకాశం భవనంలో కల్పిస్తున్న ఈ సదుపాయాలపై ప్రజలు, ముఖ్యంగా దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో మరో లిఫ్టు
27
Nov