ఒంగోలు పార్లమెంటు కాపునాడు వర్కింగ్ ప్రసిడెంట్ గా తూర్పుగంగవరంకు చెందిన
బద్దుల శ్రీను ను నియమిస్తూ శుక్రవారం నియామక పత్రం కాపు నాడు ప్రసిడెంట్ పోగుల మల్లిఖార్జున రావు, సెక్రటరీ దానరి పిచ్చయ్యలు అందించారు. ఒంగోలు లో కాపు నాడు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా కాపు నాడు కార్యకలాపాలను గ్రామస్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు మరింత బలోపేతం చేసి యువత భాగస్వామ్యం పెంచటానికి, సమాజానికి అవసరమైన సేవలు అందించటానికి బద్దుల శ్రీను నాయకత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యక్ష, కార్యదర్శులు మల్లిఖార్జు నరావు, పిచ్చలు అన్నారు. బాధ్యత స్వీకరించిన శ్రీను సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బద్దుల శ్రీనుకు జిల్లా యువజన అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు చెంగల శెట్టి సుధాకర్, గారా నారాయణ, ఒంగోలు మహిళా అధ్యక్షురాలు నగుబోతు నిర్మల. తోట క్రిష్ణ వేణి, లక్ష్మి ప్రనన్నలు, పలువురు మిత్రులు అభినందనలు తెలిపారు.

