ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో రెండు నెలలు పాటు డిసెంబర్ 01. 2025 నుండి జనవరి 31, 2026 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గాని ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే.ఎస్. విశ్వనాథన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నవంబర్, 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మరో రెండు నెలలు పాటు డిసెంబర్ 01. 2025 నుండి జనవరి 31, 2026 వరకు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు తెలియజేశారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
28
Nov