నాణ్యమైన విద్యుత్ ను అందించటమే లక్ష్యంగా విద్యుత్ సిబ్బంది పనితీరు మెరుగు
పరుచుకోవాలని విద్యుత్ ఎస్. ఈ కట్టా వెంకటేశ్వర్లు కోరారు. తాళ్లూరు , ముండ్లమూరు నబ్ స్టేషన్ ను ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ సిబ్బందితో విద్యుత్ బిల్లులు వసూలు, లైన్ మెయింటెన్స్ తదితర సమస్యలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్ బిల్లులతో పాటు, ఎస్సీ, ఎస్టీ కాలనీలో అత్యధికంగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే వనూలు చెయ్యాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితం అని అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేయించి లబ్ధి అందేలా చూడాలని, అర్హత లేని వారి వద్ద బిల్లులు వనూలు చెయ్యాలని కోరారు. సోలార్ విద్యుత్‌పై అవగాహన పెంచాలని కోరారు. సిబ్బంది సక్రమంగా పనిచేయక పోతే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు, వినియోగదారుల నుండి ఫిర్యాదు అందినట్లయితే చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు విద్యుత్ బిల్లులు నకాలంలో చెల్లించి నాణ్యమైన విద్యుత్ నరఫరాకు సహకరించాలని కోరారు. ఈఈ శ్రీనివాస రావు, ఎడీఈ రవి కుమార్, ఎఈ లు రామక్రిష్ణా, అంకబాబు లు, ఎల్ఐలు శ్రీనివాస రావు, సిబ్బంది పాల్గొన్నారు.


