జిల్లాలో గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు గుర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ కోరారు. జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం జిల్లా స్థాయి దీపం మరియు ఉజ్వల కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా పేదలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ తో పాటు స్టవ్, సురక్ష ట్యూబ్ , రెగ్యులేటర్ అందిస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ డెలివరీ చేయు సమయంలో అధిక పైకం వసూలు చేస్తున్నట్లు తరుచుగా ఫిర్యాదులు వస్తున్నాయని అటువంటి ఫిర్యాదులు రాకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారులు బిల్లు అమౌంట్ మాత్రమే ఇవ్వాలని అదనంగా ఒక్కరూపాయి కూడ చెల్లించవలసిన అవసరం లేదని చెప్పారు. ఇటువంటి ఎమైనా చేస్తే జిల్లా పౌర సరఫరాల అధికారికి ఫిర్యాదు చెయ్యాలని కోరారు. ఎరియా సెల్స్ అధికారులు ఈ ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 898లు అని . అదనంగా ఒక్కరూపాయి కూడ చెల్లించవద్దని తెలిపారు. సెల్స్ అధికారులు వినియోగదారులు తగినంత రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బయటకు వెళ్లు సమయంలో, రాత్రి వేళ సిలిండర్ యొక్క రెగ్యులేటర్ ను ఆఫ్ చెయ్యాలని కోరారు. పోయ్యి వెలిగించి ఇతర పనులలో పడి మర్చిపోవద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా పౌర సరఫరా అధికారి ఎన్ పద్మ శ్రీ సహాయ పౌరసరఫరాల అధికారి పుల్లయ్య, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సెల్ అధికారి రోహితేష్ బాగారియా, హిందూ స్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ సెల్స్ అధికారి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

