ఎపీ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందుటకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎన్ నిర్మలా జ్యోతి తెలిపారు. డిసెంబర్ 3
వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిశంబర్ 7న స్కినింగ్ టెస్ట్ నిర్వహించబడునని తెలిపారు. టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిశంబర్ 14 నుండి ఎసీ బీసీ స్టడీ సర్కిల్, గొల్ల పూడి లో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించబడునని తెలిపారు. అర్హలైన అభ్యర్థులు తమ విద్యార్హతల సర్టిఫికేట్ పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులిస్ట్ లు, కుల, ఆధాయ (లక్ష లోపు), ఆధార్ జెరాక్స్ కాఫీలు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో డిసెంబర్ 3 లోపు
ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 08592-231232, 9989285530, 8985090926 ను సంప్రదించాలని కోరారు.
బీసీ సర్కిల్ అధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ – డిసెంబర్ 3 వరకు దరఖాస్తుకు అవకాశం
28
Nov