బేగంపేట నవంబర్ 29
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట ప్రకాశం నగర్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పునర్ అభివృద్ధి ప్రణాళిక పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్, సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధాం తది తరులు శనివారం తెలంగాణ మంత్రుల నివాసంలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి మాట్లాడారు.ప్రకాశం నగర్ బేగంపేట్‌లోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ పునర్ అభివృద్ధి ప్రణాళికపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి రమేష్ , విశాల్ సూదం తో కలిసి ఆలయ అభివృద్ధి ప్రతిపాదన పత్రాన్ని మంత్రికి సమర్పించారు. ప్రణాళికను సమీక్షించిన మంత్రి కొన్ని మార్పు చేర్పులను సూచించారు.అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించి ఎండోమెంట్స్ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో ఈ విషయంలో మాట్లాడతానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఆలయ అర్చకులు మఠం సదాశివుడు, శేఖర్ గురుస్వామి,
వి. చిరంజీవీ, కృష్ణరావు (బాల) తదితరులు పాల్గొన్నారు.



