రాంగోపాల్ పేట నవంబర్ 29 (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ వృత్తిదారుల సంఘం కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు శనివారం రాంగోపాల్ పేట కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్ భూమి పూజ చేసారు. తెలంగాణా వృత్తిదారుల సంఘం అనుసంధానం సంజీవయ్య పార్క్ సదాశివ రజక సంఘం దోబీ ఘాట్ అభివృద్ధి కోసం జిహెచ్ఎంసి అధికారులతో చర్చించి రూ 4,00,000లు నిధులు మంజూరు అయ్యాయి.ఈ నిధులతో
దోబీ ఘాట్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్ మాట్లాడుతూ దోభీ ఘాట్ అభి వృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో దోబీ ఘాట్ సహాయ కార్యదర్శి అల్వాల బాబు, స్వప్న, స్థానిక సంఘ సభ్యులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

