హైదరాబాద్, నవంబర్ 29,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ లో ఆటో మేటెడ్ స్మార్ట్ మల్టీ లెవెల్ కారు పార్కింగ్ సౌకర్యాన్ని సీ ఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే గ్రోయింగ్, హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ లోనీ అత్యంత రద్దీ కలిగిన కేబిఆర్ పార్క్ వద్ద ఆటోమేటెడ్ స్మార్ట్ కార్ పార్కింగ్ సౌకర్యం ను ఏర్పాటు చేశామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.శనివారం సాయంత్రం
కేబిఆర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ,నవ నిర్మాణ్ అసోసియేట్స్ సంయుక్త అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆటోమేటెడ్ స్మార్ట్ కారు పార్కింగ్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ లతో కలిసి ప్రారంభించారు.
మేయర్ వాహనంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లు కూర్చుని ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ కార్ పార్కింగ్ లో పార్క్ చేసే విధానం , పనితీరును స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ కి పేరుందన్నారు.
ఈ మహానగరం సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని మేయర్ కొనియాడారు.సి ఎం ఆలోచనలకు అనుగుణంగానే జీహెచ్ఎంసీ అధునాతన మల్టీ లెవెల్ స్మార్ట్ కారు పార్కింగ్ వ్యవస్థకు అనుమతి ఇచ్చామన్నారు.జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ అమోదం తెలిపిన 6 నెలల స్వల్ప కాలంలోనే నవ నిర్మాణ్ అసోసియేట్స్ అధునాతన మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు.రానున్న రోజుల్లో హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు తదితర రద్దీ ప్రదేశాలలో ఇలాంటివి మరిన్ని ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ కార్ పార్కింగ్ లు పి పి పి మోడల్ లో నిర్మిస్తామని చెప్పారు.
తక్కువ స్థలంలో ఎక్కువ కారులు నిలిపేలా నిర్మించే మల్టీ లెవెల్ స్మార్ట్ కార్ పార్కింగ్ తో నగరంలో వాహన దారులకు , పాదచారులకు ప్రయోజనకరంగాఉంటుందన్నారు. పార్కింగ్ కష్టాలు, ట్రాఫిక్ఇబ్బందులు
తలెత్తకుండా ఉంటాయన్నారు.
ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ కష్టాలు దూరం చేసేందుకు సీఎం ఆలోచనల మేరకు జీహెచ్ఎంసీ సౌజన్యంతో నిర్మించిన ఆటోమేటెడ్ స్మార్ట్ కార్ పార్కింగ్ లు మరిన్ని రావల్సి ఉందన్నారు.
డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ.జీహెచ్ఎంసీ సౌజన్యంతో నిర్మించిన
ఆటోమేటెడ్ స్మార్ట్ కార్ పార్కింగ్ లతో వాహనదారుల పార్కింగ్ కష్టాలు తీరతాయని చెప్పారు.




