విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా లోని దివ్యాంగులకు ఆటల పోటిలు మరియు క్రీడలు శనివారం డి. ఆర్. ఆర్ ఎం హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో సుమారు 500 మంది దివ్యాంగులు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధనరావు ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులను ప్రోత్సాహిస్తూ, “దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందుకు సాగేందుకు క్రీడలు ఉత్తమ మార్గం మని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ దివ్యాంగులకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుంది” అని పేర్కొన్ని, ఆటల పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట రావు పాల్గొన్నారు.
సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సి. హెచ్. సువార్త , జిల్లా విద్యాశాఖాధికారి అధికారి కిరణ్ కుమార్ , డి. ఎస్. డి.ఓ
రాజేశ్వరి ఈ క్రీడోత్సవాలకు జిల్లాలోని ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలలు మరియు ప్రభుత్వ బాలరు వసతి గృహ విధ్యార్ధులతో పాటు వివిధ ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ బదిరుల పాఠశాల, ఒంగోలు, దివ్యాంగుల బాలుర వసతి గృహం, ఒంగోలు మరియు ఎస్. కె. ఆర్ బదిరుల ప్రత్యేక పాఠశాల, ప్రత్యేక మానసిక మరియు బదిరుల పాఠశాల , కనిగిరి మనోవికాస్ మానసిక మరియు ప్రత్యేక అవసరాల పాఠశాల, స్పూర్తి మానసిక మరియు ప్రత్యేక అవసరాల పాఠశాల, మార్కాపురం, చైతన్య బదిరుల ప్రత్యేక పాఠశాల, సారా కవెనంట్ హోం , గుడ్ డే అంధుల ప్రత్యేక పాఠశాల, దివ్యాంగులు సంఘాలు , ఉద్యోగులు, నిరుద్యోగలు ఉత్సాహంగా పాల్గొని వివిధ క్రీడా విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.


