ప్రకాశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు మరియు పోలీస్ అధికారులు ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నా చెడు నడత కలిగిన వ్యక్తులకు శనివారం సాయంత్రం డి ఎస్ ఆఫీస్ వద్ద కౌన్సెలింగ్ నిర్వహించారు.
పోలీస్ అధికారులు వారి యొక్క యొక్క జీవనాధారం మరియు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన యెడల చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు . ఒక వ్యక్తి మీద షీట్ ఉన్నప్పుడు దాని ప్రభావం తనపై, కుటుంబపై కూడా ఉంటుందని, ఈ చెడునడత కలిగిన ఇమేజ్ నుండి బయటపడాలని, సత్ప్రవర్తన ఒక్కటే మార్గమని, అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించినారు. బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించి గొడవలు, అల్లర్లు మరియు ఇతర నేరాల్లో పాల్గొంటే కనీసం లక్ష రూపాయల వరకు ఆస్తులు జప్తి చేయబడతాయని సూచించారు.
డీఎస్పీ వెంట టౌన్ ఎస్సైలు సాంబశివయ్య, ఫిరోజ్, కొత్తపట్నం ఎస్ఐ సుధాకర్ మరియు సిబ్బంది ఉన్నారు.
