ఒంగోలు దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బా రామ రెడ్డి 30వ వర్ధంతి ఏర్పాట్లను మాగుంట అభిమానులు అధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. డిశంబర్ 1న మాగుంట సుబ్బా రామ రెడ్డి వర్థంతి నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఒంగోలు పీవిఆర్ గ్రాండ్స్లో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లను నాగా రెడ్డి లక్ష్మి నారాయణ రెడ్డి, బెజవాడ సురేష్ రెడ్డి, ఆయినాబత్తిన ఘన శ్యామ్, తాతా ప్రసాద్ , బెల్లం సత్య, కుప్పరంగ సాయి, ఆత్మకూరి బ్రహ్మయ్య, పాలపర్తి శ్రీనా రెడ్డి ,బత్తిన క్రిష్ణా రావు, ప్రసాద్ పలువురు కార్యకర్తలు పరిశీలించారు. నేడు, రేపు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పర్యటన
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆదివారం, సోమవారం ఒంగోలులో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అందుకు సంబంధిన వివరాలను ఎంపీ కార్యాలయ ప్రతినిధులు విడుదల చేసారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎంపీ కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అందుబాటులో ఉంటారు. 4.30 గంటలకు పీవిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో దివంగత ఎంపీ మాగుంట సుబ్బ రామన్న వర్థంతి కార్యక్రమాలను యువనాయుడు మాగుంట రాఘవ రెడ్డితో కలసి పర్యవేక్షిస్తారు. 6 గంటలకు ఆర్డీఓ కార్యాలయం పరధిలో ఎన్ టిఆర్ కళా క్షేత్రం జరుగు ఒంగోలు కళామిత్ర మండలి వార్షికోత్సవ వేడుకలలో పాల్గొంటారు.
సోమవారం 8 నుండి ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అనంతరం ఒంగోలు పట్టణంలో అభిమానులు ఏర్పాటు చేసిన దివంగత ఎంపీ మాగుంట వర్థంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి, విగ్రహాలకు యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డితో కలసి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారు. 9.30 గంటలకు ప్రకాశం భవనం వద్ద జిల్లా యంత్రాంగం నిర్వహించి ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొంటారు. 10 గంటలకు ఒంగోలు పివిఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో దివంగత ఎంపీ మాగుంట సుబ్బ రామ రెడ్డి వర్థంతి సభలో యువనాయకులు మాగుంట రాఘవ రెడ్డితో కలిసి పాల్గొంటారు. మూడు గంటల నుండి ఒంగోలు ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.



