దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆదివారం ఒంగోలు అధికారులుతో మాట్లాడారు.
ఈ సందర్బంగా జనార్దన్ మాట్లాడుతూ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తాయన్న తుఫాన్ వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు వహించాలని జనార్దన్ కోరారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదు అని, ప్రజలు విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగల కు దూరంగా ఉండాలన్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా పిల్లలను, పశువులు కాపులను, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ తీగ ల వద్ద ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. అదేవిధంగా ఒంగోలు నగరంలో పోతురాజు కాలవ వెంబటి నివసించే ప్రజలు అప్రమత్తంగా వుండాలి అన్ని, మీకు సమస్య వచ్చిన పార్టీ కార్యాలయంలో ప్రతినిధులు గాని లేక మున్సిపల్ అధికారులను సంప్రదించాలి అని ప్రజలకు తెలియజేసారు. మున్సిపల్ కార్యాలయాలలో ఎమర్జెన్సీ సెంటర్ ను
కూడా ఏర్పాటు చేశారని ఏదైనా సహాయం కావాలంటే మున్సిపల్ కార్యాలయాలలో సిబ్బందికి తెలియజేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటారు అని
,మీకు ఏటువంటి సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి కూడా తీసుకురావాలి అన్ని జనార్దన్ తెలియజేసారు . ఏవైనా సమస్యలు ఉంటే
మున్సిపల్ కార్పొరేషన్ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నెంబర్
08592227766 ను సంప్రదించాలని కోరారు.
పలు పారంభోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే దామచర్ల..
ఒంగోలు మండలం మండువారిపాలెం గ్రామం లో నూతంగా 43.6 లక్షల తో నిర్మించిన సచివాలయం భవనం ,రూ. 24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిధి గా పాల్గొని ప్రారంభించారు.
అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు కళా మిత్రమండలి ఒంగోలు వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమంలో ,
ఒంగోలు నగరంలోని విష్ణుప్రియా ఫంక్షన్ హల్ నందు బెజవాడ శ్రీనివాస్ కుమారుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ,
ఒంగోలు నగరంలోని పద్మావతి ఫంక్షన్ హల్ నందు పెళ్లూరి చిన్న వెంకటేశ్వర్లు కుమార్తె ఓణిల వేడుకల్లో ,ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు గ్రామం నందు ముండ్లమూరి స్వరూప్ గారిని పరామర్శించే కార్యక్రమంలో ,ఒంగోలు నగర పరిధిలోని గుడిమెళ్లపాడు నందు పొడపాటి పాపారావు గారిని పరామర్శించే కార్యక్రమంలో ,ఒంగోలు నగర పరిధిలోని గుడిమెళ్లపాడు నందు కారుమూడి సీతారావమ్మా దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు.



