జర్నలిస్టుల సమస్యల పరిష్కార విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు అన్నారు . స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడాదిన్నర అయినప్పటికీ జర్నలిస్టుల గుర్తింపు కార్డులు ఇచ్చే విషయంలో దృష్టి సారించడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాక ముందు జర్నలిస్టుల సమస్యల పరిష్కార విషయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. గుర్తింపు కార్డుల ప్రక్రియ వాయిదాలకు పరిమితమైందని, మంత్రి కి చిత్తశుద్ధి లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు లు జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. 2019కి ముందు 23 వేల అక్రిషన్ కార్డులను వైసిపి హయాంలో 9000 కి పరిమితం చేశారని అన్నారు. అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించకపోవడం శోచనీయమన్నారు. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన జర్నలిస్టు ప్రమాద బీమా సౌకర్యం వైసిపి పాలన లో నిలిచిపోయిందని , నేటికీ అది అలానే ఉందని అన్నారు. జర్నలిస్టులకు ఉద్యమాలు కొత్త కాదని జర్నలిస్టులకు సత్వరమే గుర్తింపు కార్డులు మంజూరు చేయకపోతే ఉద్యమం చేస్తామన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్.వి రమణ, వార్త బ్యూరో మూల అల్లూరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
