జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగాభవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. పూజారు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాలరాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు ఆశ్వీర్వాదం అందించారు. ఈఓ వాసు బాబు, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు.
అన్నదానం నిర్వహణ…
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న గుంటి గంగా భవాని అమ్మవారి దేవస్థాన అన్నదాన సత్రంలో ఆదివారం అన్నదానం నిర్వహించారు.
ఈఓ వాను బాబు, దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

