రైతన్నలకు తుఫాన్ లు వెంటాడుతున్నాయి. మొంథా గాయాలు మానక ముందే దిత్వా తుఫాన్ వచ్చింది. బాగా పంట మీద ఉన్న సమయంలో మొక్కజొన్న, వరి పంటలు మొంథాతుఫాన్లో దెబ్బతిన్నాయి. మరలా ప్రస్తుతం వరి, మొక్కజొన్న కోత మీద ఉన్న సమయంలో మరో తుఫాన్ రావటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు స్పందించారు. జిల్లా వ్యవసాయాధికారి (జెడీఏ) ఎస్. శ్రీనివాస రావు, తహసీల్దార్ బి వి రమణా రావు తన సిబ్బందితో కలసి రైతులు సాగు చేసి కోత మీద ఉన్న పంటలను పరిశీలించారు. శివరామపురం, తాళ్లూరు, కొర్రపాటి వారి పాలెం, విఠలాపురం పొలాల్లో పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ కళ్లాలలో ఇప్పటికే కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని పరదా పట్టలు కప్పి రక్షిచుకోవాలని చెప్పారు. 2,3 రోజులు ఎండ బెట్టటానికి వీలు కాక పోతే గింజ మొలకెత్త కుండా ఒక క్వింటాళ్లు ధాన్యనికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక కలపాలని తెలిపారు. రైతులు తమ పొలాలలో నీరు నిలవకుండా వెళ్ల బెట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అండగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు, విఏఏ షేక్ అజ్మీర్ రైతులుపాల్గొన్నారు.

