దిత్వా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని ప్రకాశం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున,జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.