తాళ్లూరు ,తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ల పరధిలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంను పురష్కరించుకుని ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ లు నిర్వహించారు.
తూర్పు గంగవరం లో పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మౌనిక మాట్లాడుతూ సంక్రమణ వలన వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని కోరారు. హెచ్ఐవీ అంటు వ్యాధి కాదని, హెచ్ఐవీ ఎయిడ్స్ మార్పు చెందుటకు పది సంవత్సరాలు పడుతుందని తెలిపారు. హెచ్ఐవీ వ్యాధి గ్రస్తులకు వచ్చు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ బాబు, పీ హెచ్ ఎన్ రమణమ్మ, హెచ్ వీ సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తాళ్లూరులో పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ హెచ్ఐవి రోగులు క్రమం తప్పకుండా ఏఆర్ టి మందులు వాడుకోవాలని కోరారు. సిహెచ్ఓ రవణమ్మ హెచ్ ఎస్ రవి, ఆరోగ్య ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

