దిత్వా అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఆదివారం నుండి సోమవారం ఉదయం వరకు 98.2 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 39 మండలాలకు గాను 17 మండలాలలో వర్షపాతం నమోదు అయినది. అందులో అత్యధికంగా శింగరాయకొండలో 16.0 మి.మీల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మద్దిపాడు, నాగులుప్పల పాడులలో 0.8 మి.మీలు చొప్పున నమోదు అయినది. కొత్త పట్నంలో 10.6 మి.మీలు, టంగుటూరులో 8.8. ఒంగోలు రూరల్, అర్బన్ లలో 80. చొప్పున, పామూరులో 7.8, కొండేపి 7.4, పొన్నలూరు 6.6, దొనకొండ 5.6, సంతనూతల పాడు 4.4, పీసీ పల్లి 2.2, మర్రిపూడి 1.2, పెద్దార వీడు, కనిగిరిలలో 1.0 చొప్పున వర్షపాతం నమోదు అయినది. మిగిలిన 22 మండలాలలో వాతావరణం చల్లగా ఉంటూ అప్పుడప్పుడు తుప్పర్లు రాలుతున్నాయి.
