బేగంపేట డిసెంబర్ 2(జే ఎస్ డి ఎం న్యూస్) :
స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, వివిధ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 29 వ వర్ధంతిని పురస్కరించుకుని మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అధ్వర్యంలో మంగళవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు.స్థానిక బిజెపి నాయకులు గుంటి సత్యనారాయణ చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంచారు.మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా,గవర్నర్ గా ఎన్నో సేవలు అందించారని ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో కిరీటా , వికాస్ , గోపి శ్రీనివాస్ , బి. వికాస్ , యన్. చంద్ర పాల్ రెడ్డి , పార్శి పరమేశ్ , పిట్ల శ్రీనివాస్ , సగత్ వాళ్ళ వంశీ తదితరులు పాల్గొన్నారు.

