విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి వ్యక్తిత్వ వికాసం,నైతిక విలువలు దోహదపడతాయని కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు.
స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ ప్రత్యేక విద్యా దినోత్సవం సందర్భంగా, పాఠశాలలోని విద్యార్థినులకు “వ్యక్తిత్వ వికాసం — నైతిక విలువలు ” అనే అంశం మీద సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాద్యాయులు ఖాదర్ మస్తాన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రతినిధులు కె.యలమందారెడ్డి,కపురం శ్రీనివాసరెడ్డి పాల్గొని, విద్యార్థినులనుద్దేశించి ప్రసంగించారు. నేటి బాలికలే రేపటి నవభారత నిర్మాతలని, ప్రస్తుతం మహిళలు అన్నీ రంగాలలో అగ్రగామిగా వున్నారని,ఎలాంటి రాగద్వేషాలకు,అబద్రతాభావానికి లోనుగాకుండా, శారీరకంగా,మానసికంగా వుండి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకొని గమ్యం చేరాలన్నారు.ఇప్పటినుండే మంచి ఉన్నతమైన నైతిక విలువలను అలవరచుకొని,మంచి క్రమశిక్షణను, నిబద్ధతను కలిగి అబలగా కాకుండా సబలగా అత్యంత దైర్యవంతులుగా ఎదిగి,మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి, తల్లిదండ్రులు,సమాజం గర్వించేవిధంగా ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే మంచి నైతిక విలువలు అలవర్చుకొని, ఇప్పటినుండే సేవాతత్పరతను కలిగివుండాలని,జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుధ్ధులు నేర్పిన గురుకులను ఎన్నటికీ మరుకూడదని,అందరూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ చేస్తున్న మహోన్నతమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

