26 నెలల నుండి జీతాలు రావాల్సి ఉంది. కుటుంబ జీవనం కష్టసాధ్యంగా మారిందని కనికరించి జీతాలు ఇప్పించాలని బెల్లంకొండవారి పాలెం గ్రీన్ అంబాసిడార్స్ తాళ్లూరు ఎంపీడీఓ అజితను వేడుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓను గ్రీన్ అంబాసిడార్స్ ఆండ్ర లక్ష్మయ్య, కొసంకి శ్రీను, పంబా వెంకటేశ్వర్లు కలిసి డిప్యూటి ఎంపీడీఓ, గ్రామకార్యదర్శి లను తక్షణమే ఆదేశించి తమ జీతాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
