లక్కవరం జిల్లా పరిషత్, మోడల్ పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి మైక్ సెట్,
క్రీడా దుస్తులు అందించి విద్యార్థుల ఉన్నతికి తోడ్పాటు అందించారు. హైస్కూల్ హెచ్ఎం పద్మనాభ శర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బి జవహార్, గెలాక్సీ అధినేత చలువాది బదరీనారాయణ ముఖ్య అతిథులు పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఉండి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మరింత కృషి చెయ్యాలని కోరారు. మైక్ సెట్, క్రీడా దుస్తులు, గాంధీ చిత్ర పటాన్ని అందదించారు. వాటర్ ప్లాంట్ మరమ్మత్తులకు, గ్రంథాలయ నిర్వాహణకు ర్యాక్ల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు ఇస్తున్న ఎన్ ఎం సీ చైర్మన్ నరేంద్ర రెడ్డి, వాచ్ మెన్ అన్నపూర్ణమ్మలను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చలువాది పార్ధ సారధి, బాధ్యులు గౌతమ్ ప్రసాద్, ఎస్ అంజి రెడ్డి, నెరెళ్ల, ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు పెద్దినేని శేషు, పీఈ టీ విజయ్ కుమార్లు పాల్గొన్నారు.
