కస్తూరిభా గాంధీ పాఠశాలను డిప్యూటీ కలెక్టర్ ఎ కుమార్, ఎంపీడీఓ అజిత, ఎంఈఓ జి సుబ్బయ్య లతో కలసి మంగళవారం అకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మోను ను పరిశీలించారు. పాఠశాలలో వసతి, శుభ్రత ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తూ మోను ను రుచిత, శుచిగా ఉండేలా చూస్తుందని అందుకు అనుగుణంగా మంచిగా బోజనం తయారు చేసి పెట్టి ఇంటిని మై మరపించేలా విద్యార్థులను చూసుకోవాలని కోరారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని అందుకు అనుగుణంగా కృషి చెయ్యాలని కోరారు. ప్రత్యేకించి పదవ తరగతి విద్యార్థులు మరింత కృషి చెయ్యాలని చెప్పారు. బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఇతర వ్యవహాలపై ప్రత్యేక అవగాహన కలిగి నమాజాన్ని ఎదుర్కోవాలని చెప్పారు. ఎమైనా సమస్యలు ఉంటే తక్షణమే తెలిపి తగిన సహాయం పొందాలని కోరారు. మోను పై సంతృప్తి వ్యక్తం చేసారు. కస్తూరిభా ప్రిన్సిపాల్ సుజిత, ఆరో నుధీర్ తదితరులు పాల్గొన్నారు.


