బొద్దికూరపాడులో రైతన్న మీకోసం వర్క్ షాప్ నిర్వహణ

తాళ్లూరు మండలంలోని బొద్దికూరపాడు గ్రామ రైతు సేవా కేంద్రం నందు సర్పంచ్ మందా శాంసన్
ఆధ్వర్యంలో రైతన్న మీకోసం వర్క్ షాప్ బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీను మాట్లాడుతూ రైతులకు ముఖ్యమంత్రి పంచ సూత్రాల ప్రాధాన్యతను రైతులకు తెలియజేశారు. అదేవిధంగా ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం జి. వి. ఎ ను పెంచడం అని తెలిపారు. అదేవిధంగా ఉప సర్పంచ్ పులి ప్రసాదరెడ్డి మాట్లాడుతూ పిఎం కిసాన్ పథకంలో భాగంగా 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఆన్లైన్ ఎక్కిన పొలాలకు పీఎం కిసాన్ అర్హతకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా వెటర్నరీ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమలవుతున్న పథకాల గురించి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బాల కోటయ్య, గ్రామ నాయకులు రమణారెడ్డి, చిన్న నాగిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *