రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం నాడు టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తల కోలాహలం మధ్య మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు మంత్రిని కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం నాడు పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి బాల వీరాంజనేయ స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నర సింహా రెడ్డి , దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ,డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లో కలసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా డాక్టర్ కడియాల దళిత సాగర్ కు కూడా జన్మదిన శుభాకాంక్షలు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు.









