తాళ్లూరు మండలంలోని చింతలపాలెం ప్రాదమిక పాఠశాల విద్యార్థులు ఈనెల 5వతేదీన జరుగనున్న మెగాపేరెంట్స్ టీచర్స్ కు వినూత్న రీతిలో ఇంటింటికి ప్రత్యేక వస్త్ర దారణలో వెళ్లి తల్లిదండ్రులకు గురువారం ఆహ్వాన పత్రికలు అందజేశారు. చిన్నారి విద్యార్థులు గత నాలుగు రోజులుగా తమ వద్ద వున్న వైట్ పేపర్లు, స్కెచ్ పెన్ను లతో ఆహ్వాన పత్రికలు, రాసి కవర్లు రంగులతో తీర్చిదిద్దారు. శుక్రవారం జరుగ నున్న మెగా పేరెంట్స్,టీచర్స్ కార్యక్రమం కు ఆహ్వానించేందుకు ప్రత్యేక వస్త్ర ధారణలో కలిసి కట్టుగా ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించి కార్యక్రమంకు రావాలని ఆహ్వానించటం జరిగింది.
