తాళ్లూరు మండలంలో పొదుపు మహిళలు పాల ఉత్పత్తిపై ఆదారపడి జీవినిస్తున్నందను వారికి అధికంగా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు నిర్వనున్నట్లు ఏపీ సెర్చ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎన్.ఎస్.ఆర్.మూర్తి తెలిపారు. స్థానిక వెలుగు కార్యాలయంలో పొదుపు మహిళలకు జీవనోపాదులపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో పాలఉత్పత్తి అధికంగా వుందని, అందులో పొదుపు మహిళలు ఎక్కువ మంది ఉన్నారన్నారు. పాల ఉత్పతిలో ఉత్సాహకంగా పాల్గొనే మహిళలకు ప్రభుత్వం చేయూత నిస్తుందన్నారు. పాల ఉత్పత్తిని పాలుగా విక్రయం చటమే కాకుండా ఇతర రూపాల్లో మార్కెట్ చేసుకుంటే అధికలాభాలు వస్తాయన్నారు. దీంతోపొదుపు మహిళల కుటుంబాలు ఆర్థికంగా వృద్ధి చెందుతాయన్నారు. పాడి పరిశ్రమంలో ఏదైన కొత్తమార్గంలో వ్యాపారాలు చేసేందుకు ముందుకు వస్తేరూ2లక్షల నుండి రూ. 20లక్షల వరకు 35శాతం సబ్సీడీపై బ్యాంక్ రుణాలు మం జూరు చేయించి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ చేయటం జరుగుతుందన్నారు. పాడిపరి శ్రమ చేస్తున్న మహిళా రైతులకు పాడి పరిశ్రమ వల్ల ఎదిగే విదానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఈ సీవో బాలకృష్ణరాజు, నామ్ ఏపీఎం బి.సుబ్బారావు,ఏపీఎం పి.దేవరాజ్, సీసీ మోహన్ రావు, వివోఏలు, మహిళలు పాల్గొన్నారు.
