దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ జన్మదిన వేడుకలు మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ విగ్రహాం వద్ద కేక్ ను
కట్ చేసి పంచి పెట్టారు. లలిత్ సాగర్ ఆయ రారోగ్యాలతో, మరెన్నో వేడుకలు జరుపుకోవాలని, ఉన్నతస్థానంలో నిలవాలని కోరుతూ టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. కేక్ ను కట్ చేసిన సందర్భంలో తిరుపతిలో వున్న లలిత్ సాగర్ కు వీడియో కాల్చేసి పలువురు స్వయంగా శుభా కాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులుమేడగం వెంకటేశ్వర రెడ్డి, వైస్ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి , రాష్ట్ర నాటక అకాడమీ కార్పోరేషన్ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, టీడీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మానం రమేష్ బాబు, రాష్ట్రతెలు గుయువతకార్యదర్శి గొల్లపూడివేణుబాబు, మ న్నేపల్లి సొసైటీ అధ్యక్షులు గొంది. రమణారెడ్డి, టీడీపీ కాలేపావలి, క్లస్టర్ ఇంచార్జ్ రాచకొండ వెంకట్రావు, డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ శివనాగిరెడ్డి, విద్యాసాగర్ , షేక్ కాసిం సైదా చెన్నపురెడ్డి వీరనాగిరెడ్డి, ఇడమకంటి.శ్రీనివాసరెడ్డి,కె.రామకోటిరెడ్డి, కె.నాగార్జునరెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, మారంవెంకటరెడ్డి,అనపర్తి సుబ్బారావు,కె.రా మయ్య, పేరిరెడ్డి,హనుమారెడ్డి, మహిళానేత మారాబత్తుల సుజాత, టీడీపీ శ్రేణులు, కడియాల,గొట్టిపాటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
*దర్శి అన్ని రంగాలలో అభివృద్దే నా ఆకాంక్ష…*
*– డాక్టర్ కడియాల*
దర్శి ప్రాంతం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఆకాక్షించారు. ఈ మేరకు డాక్టర్ కడియాల తన జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వర రావు , దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , కుటుంబ సభ్యులతో కలిసి కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శి ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని కోరినట్టు డాక్టర్ కడియాల తెలిపారు.





*శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యక పూజలు చేసిన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – లలిత్ సాగర్ దంపతులు*.
టిడిపి యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ జన్మదినోత్సం సందర్బంగా గురువారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి – అమ్మవార్ల దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.