నాణ్యమైన దర్యాప్తుతో గ్రేవ్ కేసులను త్వరితగతిన ఛేదించాలి -ఎస్పీ హర్షవర్ధన్ రాజు – జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహణ

దర్యాప్తు లో ఉన్న శారీరిక నేరాలు, దొంగతనం, గంజాయి మరియు ఇతర గ్రేవ్ కేసులు,కేసుల గుడ్ ట్రయల్ మానిటరింగ్, ఎన్ఫోర్స్మెంట్/ రోడ్డు ప్రమాదాలు మరియు తదితర అంశాలపై జిల్లా పోలీస్ కార్యాలయ నుండి ఒంగోలు, దర్శి, కనిగిరి మరియు మార్కాపురం సబ్ డివిజన్ ల డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో జిల్లా ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి ఆయా కేసుల సత్వర పరిష్కారంకు దోహదపడే విధంగా తగిన సూచనలు, మార్గదర్శకాలుఎస్పీ హర్షవర్ధన్ రాజు జారీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో గ్రేవ్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని, సమగ్ర దర్యాప్తు చేపట్టి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ముద్దాయిలను అరెస్ట్ చేసే విధంగా, తగిన సాక్ష్యాధారాలతో కోర్ట్ లో నిర్ణీత సమయంలో కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంతో పాటు, కేసుల్లో శిక్షాశాతం పెంచేందుకు ఎక్కువ కృషి చేయాలని సూచించారు. సంవత్సరం ముగింపు సందర్భంగా పెండింగ్ కేసులను త్వరితగతంగా తగ్గించాలన్నారు.

రానున్న లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులను లిస్టు అవుట్ చేసి, ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోని ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు. దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం తోపాటు, విజిబుల్‌ పోలీసింగ్‌ చేస్తూ, నైట్‌ బీట్స్‌ బలోపేతం చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు.

పోక్సో/మహిళల కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదై వెంటనే విచారణ వేగవంతం చేయలని, నిర్ణీత సమయంలో ఛార్జి షీట్ ఫైల్ చేయుటకు ప్రత్యేక భాద్యత తీసుకోవాలని, కోర్టు లో నేరం రుజువు చేసి నేరస్థులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు.

గంజాయి పెండింగు కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని, గంజాయి రవాణా చేసేవారు, రిసీవ్ చేసుకునే వారితో పాటు లోకల్ పెడ్లర్స్ గుర్తించాలన్నారు.దీంతో పాటు పెడ్లర్స్ కు లింకై ఉన్న నిందితులను, మాదకద్రవ్యాలని సేవించే వారిని గుర్తించి చర్యలు తగిన తీసుకోవాలని, గంజాయి/మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే విధంగా ప్రత్యేక ప్రణాళికలను రూపకల్పన చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇదిలా ఉంటే ముఖ్యంగా పొగమంచు ఏర్పడే సమయాల్లో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

నేర చరిత్ర/చెడు నడత(షీటర్స్) గల వ్యక్తులపై నిఘా వుంచాలని, వారి యొక్క కదలికలను, దైనందిన జీవన విధానాన్ని, వారు చేసే పనులు, ప్రవర్తన పై నిఘా ఉంచాలని, ఏవైనా అనుమానిత చర్యలు ఉంటే వెంటనే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. పదేపదే నేరాలకు పాల్పడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నవారిని అలాగే గంజాయి కేసుల్లో ఉన్న ముద్దాయిలపై అధికారులతో సమీక్షించి, వీరిపై పీడి చట్టం అమలు చేయుటకు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎస్బి డిఎస్పీ చిరంజీవి, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, మార్కాపురం డిఎస్పీ యు. నాగరాజు, కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి రమణ కుమార్, డిసిఆర్ బి సిఐ దేవ ప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *