నేటి యువత ఆలోచనలు, మేధోసంపత్తి సమాజంలో నెలకొని వున్న సమస్యలకు పరిష్కార దిశగా ఉండటంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
పేర్కొన్నారు.
గురువారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో త్రిబుల్ ఐటి, క్విస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులతో నిర్వహించిన ఐడియా టు ఇంపాక్ట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు రూపొందించిన ప్రాజెక్టు నమూనాలను జిల్లా కలెక్టర్ ఆసక్తితో తిలకించడంతో పాటు ప్రాజెక్టు పనిచేయు విధానాన్ని విధ్యర్దుల నుండి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, మేధోసంపత్తి సమాజంలో నెలకొని వున్న సమస్యలకు పరిష్కార దిశగా ఉండటంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. యువత యొక్క వినూత్న ఆలోచనలు, మేధోసంపత్తిని, ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించేందుకు జిల్లాలో ఐడియా టు ఇంపాక్ట్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతకు మెరుగైన భవిష్యత్తును కల్పించేందుకు తద్వారా సమాజానికి ఉపయోగపడేలా ఉంటుందన్నారు. ఈ రోజు పలువురు విద్యార్ధులు స్వీయ నియంత్రణతో నీటి ట్యాంక్ నింపే వ్యవస్థ, స్మార్ట్ నీటి భద్రత మరియు వ్యాధి హెచ్చరిక వ్యవస్థ, టచ్‌లెస్ స్మార్ట్ డస్ట్‌బిన్, వాయిస్ నియంత్రిత వీల్ చైర్ ఐ.ఓ. టి ఆధారిత సెలైన్ మానిటరింగ్ మరియు హెచ్చరిక వ్యవస్థ, ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ల కోసం వైఫై ఎనేబుల్ ఫాల్ట్ డిటెక్షన్ సిస్టమ్, రియల్ టైమ్ లొకేషన్ మరియు అత్యవసర హెచ్చరికలతో కూడిన కాంపాక్ట్ మహిళా భద్రతా పరికరం వంటి నమూనాలను రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ నమూనాలను ఎంతో ఉపయోగపడతాయని, క్షేత్రస్థాయిలో ఈ నమూనాలను పైలెట్ ప్రాజెక్టు గా వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా ఆర్ధిక తోడ్పాటు కల్పించడం జరుగుతుందన్నారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా యువత కూడా తమ ఆలోచనలను, మేధోసంపత్తిని పెంపొందించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన ఒక యాప్ ను అభివృద్ధి చేయిస్తున్నానన్నారు. దీని ద్వారా వివిధ రంగాలలో నిపుణులైన వారితో జిల్లాలోని యువత తమ ఆలోచనలతో అనుసంధానం కావచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డివిఆర్ మూర్తి, స్టెప్ సిఈఓ శ్రీమన్నారాయణ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవి తేజ, సిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వర రావు, త్రిబుల్ ఐటి కళాశాల విద్యార్ధులు , క్విస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

