హైదరాబాద్, డిసెంబర్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అభివృద్ధి భద్రత కోసం తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హామీ ఇచ్చారు.శుక్రవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి అలాగే టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి లను వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వివిధ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా సీఐ అప్పలనాయుడు ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యవసరంగా చేపట్టాల్సిన పలు మరమ్మతులు, అభివృద్ధి పనుల గురించి వివరించారు. రోడ్ల దుస్థితి, వీధి దీపాల సమస్యలు, చెట్ల కమ్మలు, శుభ్రత లోపాలు, పహరిగూడ ప్రాంతంలో నీటి సమస్యలు తదితర సమస్యల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించి వినతి పత్రాన్ని డిప్యూటీ మేయర్ కి అందజేశారు.అదనంగా, ఓయూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు అందిస్తున్న ఫిర్యాదుల స్వభావం, వాటి పరిష్కారంపై ఉన్న లోపాలను కూడా డిప్యూటీ మేయర్ కి వివరించారు. ప్రజల న్యాయసంబంధ సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అప్పలనాయుడు కోరగా, డిప్యూటీ మేయర్ వాటి వివరాలను తెలుసుకుని తగిన సూచనలు చేశారు.అలాగే, పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కొన్ని అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అప్పలనాయుడు కోరారు. దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఓయూ పీఎస్ పరిధిలోని అన్ని ముఖ్య ప్రాంతాలను కవర్ చేసే విధంగా కొత్త సీసీ కెమెరాల అమరిక కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
డిప్యూటీ మేయర్ చొరవతో ఓయూ పోలీస్ స్టేషన్ మరియు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి, భద్రత, ప్రజా సేవా వ్యవస్థలు త్వరలోనే మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. సి ఐ వెంట డిప్యూటీ మేయర్ ను కలిసిన వారిలో ఎస్సై ఆర్.జయచందర్ ఉన్నారు.

