చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విఠలాపురం గ్రామానికి చెందిన మేడగం రామిరెడ్డి (21) ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఎంపీ మాగుంట అనుచరుడు మేడగం సుబ్బారెడ్డికి ముగ్గురు కుమారులు . అందులో కవల పిల్లల్లో రామిరెడ్డి మొదటి కుమారుడు. అందరిలో తలలో నాలుక వలె ప్రవర్తించే రామిరెడ్డి మృతి చెందడం తో విఠలాపురం
కాలనీ శోకసముద్రంలో మునిగిపోయింది.
ఈ దుర్ఘటన చాలా బాధాకరం అని టిడిపి యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి రామిరెడ్డి మృత దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ద్వారా ప్రభుత్వపరంగా వారికి ఆర్థిక సహాయం అందేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర నాటక కార్పొరేషన్ డైరెక్టర్ ఓబుల్ రెడ్డి, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మానం రమేష్, రాష్ట్ర యూత్ కార్యదర్శి గొల్లపూడి వేణు బాబు , క్లస్టర్ ఇంచార్జ్ ఆర్. వెంకట రావు , నాగార్జున రెడ్డి వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొని సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు.

