డెంగ్యూ, విష జ్వరాలపై అవగాహన కలిగి నియంత్రణకు తగిన జాగ్రత్తలు పాటించాలని తూర్పుగంగవరం పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మౌనిక కోరారు. తూర్పు గంగవరంలో శుక్రవారం డెంగ్యూ, విషజ్వరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జ్వరం వచ్చిన సమయంలో నమీప పీహెచ్ సి ని సందర్శించి తగిన పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. దోమల నివారణకు పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలని, ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని కోరారు. సీజనల్ వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాచి చల్చాల్చిన నీటిని తాగాలని సూచించారు. వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ .ఎస్ చంద్రశేఖర్ బాబు ,
హెచ్ ఎ గోపి నాయక్, ఎం ఎల్ హెచ్ పీ మరియమ్మ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
