జిల్లాలో ఎస్.సి, ఎస్.టి. కేసుల విచారణ చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా చర్యలు తీసు కోవాలి – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి

జిల్లాలో ఎస్.సి, ఎస్.టి. కేసుల విచారణ చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా చర్యలు తీసు కోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్లోని గ్రీవెన్స్
హల్ లో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులను సత్వరంగా పరిష్క రించే దిశగా అధికారు లు పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో క్యాస్ట్ సర్టిఫికెట్లు లేని కారణం గా కేసులు విచారణ ఆలస్యం జరుగు తుందనిఅధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో అవసరమైన కుల సర్టిఫికెట్లను రెవెన్యూ అధికారులు వెంటనే విచారించి మంజూరు చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో ఎస్టీ ఎస్టీ కాలనీలకు స్మశాన భూములు సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్య మంత్రి ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కాలనీలకు స్మశాన భూములు ప్రభుత్వ భూములు ఉంటే పరిశీలించాలని, లేకపోతే ప్రైవేట్ భూములను భూసేకరణ ద్వారా చేపట్టాలని ఆయన రెవెన్యూ అధికారులు ఆదేశించారు. స్మశాన భూములకు వెళ్లడానికి అవసరమైన దారి నిర్మించడానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అనుసంధానం చేసి మంజూరు చేయాలని ఆయన అధికారులు చెప్పారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు నివసించే గ్రామాలలో సివిల్ రైట్స్ డేని తప్పనిసరిగా అధికారులు నిర్వహించాలని ఆయన చెప్పారు. సివిల్ రైట్స్ డే గురించి గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసుల అత్యాచార కేసుల బాధితులకు మానిటరింగ్ అమౌంట్ నిధులు కావలసిన మేర ఉన్నాయని ఆయన చెప్పారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితులకు వెంటనే మానిటరింగ్ బెనిఫిట్ అందజేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. జిల్లాలో గతంలో మంజూరు చేసి అసంపూర్తిగా నిలిచిపోయిన అంబేద్కర్ భవనాలను నిర్మించడానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు. నిలిచిపోయిన అంబేద్కర్ భవనాల అంచనాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు నగరంలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని ఆధునికరించడానికి 75లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ ప్రజలకు గృహనిర్మాణశాఖ ద్వారా గృహాలు మంజూరు చేయడానికి అవసరమైన భూము లు పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ గృహాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ వసతి గృహాలకు శాశ్వత భవనాలను నిర్మించ డానికి రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలకు శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఒంగోలు శాసనస భ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ భవన్ లో ఫంక్షన్ జరుపు కోవడానికి అవసర మైన ఫర్నిచర్ లేదని అంబేద్కర్ భవన్ ఆధునిక రించ డానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ట్రంకు రోడ్ విస్తరణలో హెచ్.సి.ఎం స్కూలు ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహని తొలగించవలసిన అవసరం ఉన్నందున ఆ ప్రాంతంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న గిద్దలూరు శాసనస భ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరు చేసిన మధ్యలో నిలిచి పోయిన అంబేద్కర్ భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. గిద్దలూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలకు స్మశానభవము లేవని మంజూరు చేయవల సిందిగా ఆయన కోరారు. గిద్దలూరు నియోజక వర్గంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ల మరమ్మ తులకు నిధులు మంజూరు చేయవల సిందిగా ఆయన కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కాలనీల స్మశాన భూములు లేవని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ ప్రైవేటు బిల్డింగుల్లో ఉన్నాయని వాటి స్థానంలో సొంత భవనాలను మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో స్మశాన భూములు లేవని మంజూరు చేయవలసిందిగా ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో స్మశాన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని వాటిపై చర్య తీసుకో వల్సిందిగా ఆయన కోరారు.
ఈసమావేశంలో పాల్గొన్న కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్.సి,ఎస్.టి కాలనీలకు స్మశాన భములు లేవని ప్రజలుచాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ప్రవేట్ అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమవసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించడా నికి చర్యలు తీసుకోవా లని ఆయన మంత్రిని కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులను వేగవంతంగా పరిశీ లించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎస్సీ.ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధితులకు నష్ట పరిహాన్ని చెల్లించ డానికి తీసుకుంటా మని ఆయన చెప్పారు. జిల్లాలో ఎస్.సి,ఎస్.టి కాలనీ లో స్మశాన భూములు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా మని ఆయన చెప్పారు. జిల్లాలోని ఎస్సీ,ఎస్టీ కాలనీలలో సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్స్ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటా మని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులను వేగవం తం చేయాలని పోలీసుఅధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ అనంతరం చార్జీషీట్ లను త్వరితగతిన దాఖలు చేయాలని ఆయన చెప్పారు.
ఈ సమావేశం లో ఎస్.సి, ఎస్.టి. వర్గాలకు
చెందిన ఆనాధికార సభ్యులు వై. వెంకటేశ్వర్లు,పి. మనీందర్ దేవ్, ఎం.గురవయ్య, పి.సునీత, కె.అన్నోజి రావు, స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధి షేక్. మొహమ్మద్ ఖాసిం, జిల్లారెవెన్యూఅధికారి ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మ నాయక్ , జిల్లా పంచాయతీఅధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *