భగీరధ కెమికల్స్ వారు సిఎస్ఆర్ కింద సర్వేరెడ్డిపాలెం గ్రామంలో 32 లక్షలతో సురక్షిత తాగునీటి సదుపాయం, వాకింగ్ ట్రాక్, మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్, డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ గ్రామాన్ని దత్తతు తీసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.
ఒంగోలు మండలం, సర్వేరెడ్డిపాలెం గ్రామంలో పి4 భాగంగా భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఎస్కెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 18 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి ఆర్ఓ ప్లాంట్ ను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు. ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డా. కామేపల్లి సీతా రామయ్య, ఒంగోలు మార్కెట్ యార్డు చైర్మన్ వెంకట రావు, భగీరథ ఇండస్ట్రీస్ ప్రతినిధులు లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ భగీరధ కెమికల్స్ వారు సిఎస్ఆర్ కింద సర్వేరెడ్డిపాలెం గ్రామంలో 32 లక్షలతో సురక్షిత తాగునీటి సదుపాయం, వాకింగ్ ట్రాక్ , మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్, డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు
చేయడం తో పాటు ఈ గ్రామాన్ని దత్తతు తీసుకోవడం అభినందనీయమన్నారు. సమాజం మనకు చాల చేసింది, ఆ సమాజానికి తిరిగి మనం చేయాలి అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సరికొత్త పి 4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న వ్యక్తులు పే బ్యాక్ సొసైటీ నినాదంతో ఆ గ్రామానికి అక్కడ ఉన్న ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశ్యంతో భగీరధ కెమికల్స్ వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా భగీరధ కెమికల్స్ ప్రతినిధులు వెంకటరామయ్యకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. 2023-24 లో 99 లక్షలు, 2024-25 లో 88 లక్షలు, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 32 లక్షలు ఇలా భగీరధ కెమికల్స్ వారు ప్రతి సంవత్సరం సి.ఎస్.ఆర్ కింద నిధులు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. నేటి పరిస్థితుల్లో సురక్షిత నీరు అనేది చాల ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మాసం అంతా జల సురక్షా కింద ప్రకటిస్తూ, ఈ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులు, ఆర్ఓ ప్లాంట్స్ ను శుభ్రం చేయడం, రిపేరు చేయడం జరుగుచున్నదన్నారు. దాత వచ్చి గ్రామానికి ఏదైనా చేసారంటే దాన్ని మనమంతా జాగ్రత్తగా చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్ ఓ ప్లాంట్ ను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేవలం లాభాపేక్ష కాకుండా సమాజానికి తనవంతు సాయం చేయాలన్న మంచి ఉద్దేశ్యం తో మంచి కార్యక్రమాలు చేస్తున్న భాగీరధ కెమికల్స్ వారిని మరోసారి అభినందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ, భగీరధ కెమికల్స్ వారు ఈ రోజు సర్వేరేడ్డిపాలెం గ్రామంలో 18 లక్షల రూపాయలతో ఆర్. ఓ ప్లాంట్ ను ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. భగీరధ కెమికల్స్ వారు ఎర్రజెర్ల, సర్వేరేడ్డిపాలెం, చెరుకుమూడి పాలెం, వెంగముక్కలపాలెం గ్రామాలను దత్తతు తీసుకుని గ్రామ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను సి.ఎస్.ఆర్ కార్యక్రమం కింద చేపట్టడం జరుగుచున్నదన్నారు. ప్రజలందరూ సురక్షితమైన తాగునీరు తాగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పూర్వకాలంలో ప్రజలు బావుల్లో, చెరువుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించే వారమని, నేటి ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే ఎర్రజెర్ల, వెంగముక్కలపాలెంలో భగీరధ కెమికల్స్ వారు ఆర్ ఓ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మదర్ దెరిసా కాలనీ లో కుడా ఏర్పాటు చేయమని కోరడం జరిగిందని, భగీరధ కెమికల్స్ వారు ఒప్పుకోవడం జరిగిదన్నారు. భగీరధ కెమికల్స్ వారు ప్రజల కోసం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
అనంతరం పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో 50 శాతం రాయితీ పై గ్రామ ప్రజలకు పశువుల దాణా ను పంపిణీ చేసి, మొక్కలు నాటారు. అనంతరం డా బి ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, సిపిఓ సుధాకర్ రెడ్డి, గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


