కంటోన్మెంట్ డిసెంబర్ 7(జే ఎస్ డి ఎం న్యూస్) :
కంటోన్మెంట్ నియోజక వర్గం పరిధిలోని బస్తీలు,కాలనీలలో తాగునీటి ఎద్దడి,డ్రైనేజ్ వ్యవస్థల మెరుగుకు కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు.ఆదివారం నియోజక వర్గం లోని వార్డు 5 లో 10 వ రోజు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీ పర్యటన చేశారు.బస్తీ పర్యటన సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో వేయించిన నూతన బోర్ వెల్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
బస్తీలసమస్యలుతెలుసుకోవడానికి చేపట్టిన బస్తీ పర్యటనలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వార్డు 5 కాకా గూడ,కింది బస్తీ, బాలాజీ కాలనీ, గడ్డమీద బస్తీ, దర్జీ బస్తీలలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి బస్తీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న కింది బస్తీలో స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో ఇటీవల వేయించిన నూతన బోర్ వెల్ ను ప్రారంభించారు.
అనంతరం బస్తీ వాసులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించి బస్తీ వాసులకు అవసరమైన కమ్యూనిటీ హాల్, సిమెంట్ రోడ్లునిర్మాణం చేయిస్తామన్నారు.,నూతన బోర్ వెల్స్ వేయిస్తానని చెప్పారు.అలాగే నూతన కరెంట్ పోల్స్, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారం లభించేలా చూస్తానని బస్తీ వాసులకు ఎమ్మెల్యే శ్రీగణేష్ చెప్పడంతో తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఎమ్మెల్యే కి బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలపడంతో మీ ఓటు వృధా కానివ్వనని బస్తీలను అభివృద్ధి చేసి మీ ఆదరాభిమానాలు చూరగొంటానని ఎమ్మెల్యే వారితో అన్నారు.ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకి రవీందర్, నాగేందర్ యాదవ్,సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతోష్,బిక్షపతి, విష్ణు, సాయి,శ్యామల, రజనీ , పెద్ద బిక్షపతి, అశోక్, బాలకృష్ణ, అరవింద్ తదితరులు ఉన్నారు.



