మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ వైసిపి ఆధ్వర్యంలో తూర్పు గంగవరం లో ఆదివారం సంతకాల సేకరణ నిర్వహించారు.
. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జులయోగి రెడ్డి,
జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి గూడా గోపాల్ రెడ్డి, జిల్లా బూత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కటకం శెట్టి శ్రీనివాసరావు, జిల్లా లీగల్ ప్రధాన కార్యదర్శి గోపు శ్రీనివాస రెడ్డి, నియోజకవర్గం ప్రచార విభాగ అధ్యక్షుడు యత్తపు మధుసూదన్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ లతీఫ్ ( బచ్చ) , నాయకులు గుజ్జుల వెంకటేశ్వర రెడ్డి (గోల్డ్), జిల్లా మైనార్టీ సెల్ మాజీ కార్యదర్శి సయ్యద్ లతీఫ్ , సయ్యద్ సైదా , బడేషా , భాష, గురవారెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
