తాళ్లూరు మండల ఇంచార్జి డిప్యూటీ ఎంపీడీవోగా గ్రామ, వార్డు సచివాలయ డిప్యూటీ ఎంపీడీవో వంకాయలపాటి శ్రీనివాసరావును నియమిస్తూ ఎంపీడీవో పి.అజిత ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే గ్రామసచివాలయ, వార్డులకు నూతనం గా డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావును నియమించారు. పర్చూరు మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ జిఎస్ఈబ్ల్యుఎస్ డిప్యూటీ ఎంపీడీవోగా పదోన్నతి పై తాళ్లూరు మండలానికి వచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ ఎంపీడీవోగా వున్న తూర్పుగంగవరం పంచాయతీ కార్యదర్శి నాగమల్లేశ్వరి మూడు పంచాయతీలకు ఇంచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. పనిభారం అధికంగా వుండటంతో జిఎస్ఈ బ్యుఎస్ డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావును ఇంచార్జి డిప్యూటీ ఎంపీడీవోగా నియమిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు జారీ చేశారు.
