ఒంగోలు లోని హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్ పి కార్యాలయంలో నిర్వహించిన 63 వ హోంగార్డ్స్ రైజింగ్ డే లో నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వాసి కొలకలూరి శ్యామ్ బాబు మంచి ప్రతిభ కనపరిచారు. ఈ సందర్బంగా నిర్వహించిన క్రీడాపోటీలలో,లాంగ్ జంప్ లో30 మంది హోంగార్డ్స్ పాల్గొన్నారు దీనిలో శ్యామ్ బాబు మొదటి స్దానంలో సాదించి మంచి ప్రతిభ కనపరచారు. అదేవిదంగా వాలీబాల్ లో మొదటి బహుమతి సాదించారు మంచిప్రతిభ కనపరచిన శ్యామ్ బాబును జిల్లా ఎస్ పి హర్షవర్దన్ రాజు అభినందించి మెమెంటో అందచేసారు తదుపరి జరగబోయే క్రీడల్లో మంచిప్రతిభ కనపరచి పోలీస్ శాఖకు మంచిపేరు తీసుకురావాలని అభినందించారు.
