గత ప్రభుత్వంలో శివరాంపురం గ్రామంలో నిర్వహించిన రీసర్వేలో అప్పటి గ్రామ సర్వేయర్ రికార్డులు, భూములు పరిశీలించకుండా చేసిన సర్వే వల్ల తప్పులు జరిగి ఇబ్బందులుపడుతున్నామని, తప్పు లు సరిదిద్ది రైతాంగంకు న్యాయం జరి గేలా చూడాలని శివరాంపురం గ్రామస్తులు నారిపెద్ది కళ్యాణ్ చక్రవర్తి, నారిపెద్ది వెంకటేశ్వర్లు, వి రాఘయ్య, ఎన్ గోపాల్‌రావు, ఒంగోలు లో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఫిర్యాధు చేశారు. రీసర్వే వల్లభూముల కొలతల్లో తీవ్ర వ్యత్యాసం వచ్చిందన్నారు. రీసర్వే తప్పులవల్ల 1బిలు రావటం లేదని, బ్యాంక్ందు రుణాలు మంజూరు కావటంలేదని, రిజిస్ట్రేషన్లు నిలి చి పోయాయని, గతంలో వున్న పాసు బుక్ లో
వున్న విస్తీర్ణంలో తేడాలు వుండటంతో బ్యాంక్ వారు రుణాలు ఇవ్వటంలేదని, దీని వల్ల రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని
తెలిపారు. రీసర్వే సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన గ్రామసభలో 129ధరఖాస్తులు అందజేయగా పరిష్కారం కాలేదని తెలిపారు. గత గ్రామ సర్వే యర్ రైతుల సమక్షంలో రీసర్వే జరుపక, కార్యాలయంలో కూర్చుని రికార్డులను తన ఇష్టానుసారం తారు మారు చేయటం వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతు న్నారన్నారు. కొత్తగా గ్రామ సర్వేయర్ గా నియమితులైన శ్యామ్ రీసర్వే సమస్యలు పరిష్కరిస్తుండగా ఏప్రిల్ మాసంలో గ్రామసర్వేయర్ ను డిప్యూటేషన్ పై బదిలీ
చేశారన్నారు. అప్పటి నుండి గ్రామ సర్వేయర్ లేక రైతాంగ భూసమస్యలు పరి
చేశారన్నారు. అప్పటి నుండి గ్రామ సర్వేయర్ లేక రైతాంగ భూసమస్యలు పరి ష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రీసర్వే నందు తప్పులు చేసిన గ్రామ సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని, డిప్యూటేషన్ పై వెళ్లిన గ్రామ సర్వేయర్ ను
తిరిగి నియమించి రైతుల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.


