ప్రస్తుత సీజన్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలని మండల ప్రత్యేక అధికారి ఏ.కుమార్ తెలిపారు. తాళ్లూరులోని పారువేట వీధిలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి స్క్రబ్ టైఫస్ వ్యాధిపై మంగళవారం అవగాహనకల్గించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్ సన్నటి క్రిమికీటకం ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వ్యాధిఅంటు వ్యాధి కాదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపొందుతుందన్నారు. రైతాంగం వ్యవసాయ పనులు, గడ్డి, వాముల నుండి గడ్డి తీసుక వెళ్లేటప్పుడు తేమ తగల కుండా చేతి తొడుగులు కాళ్లకు నిండు చెప్పులు తప్పని సరిగా వాడాలన్నారు. తేమలో వుండే ఈ వ్యాధి వ్యాప్తికి చెందిన చిన్నక్రిములు శరీరం తాకగానేఎర్రటి బెందులు వస్తాయన్నారు.దీనిని గుర్తించి తక్షణ వ్యాధినివారణ చర్యలు పాటిస్తే ఇబ్బందులు వుండవ
న్నారు.ప్రజలు అప్రమత్తంగా వుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు ఉం డవన్నారు. తాళ్లూరు పిహెచ్ సి వైద్యాధికారి రాజేష్ యాదవ్ మాట్లాడుతూ ఈవ్యాధి మంచల్లో గడ్డి వాముల్లో, ఇతరప్రాతంతాల్లో వుండే కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. వ్యాధి గ్రస్తులకు ఎలాంటి లక్షణాలు కన్పించక జ్వరం
వచ్చి తగ్గకుండా తల నొప్పి వస్తుందన్నారు.
జ్వరం తగ్గకుండా వుండి ఊపిరితిత్తుల సమస్యల, తలభార సమస్య ఎక్కవై ప్రమాదం జరిగే వీలుందన్నారు. జ్వరం రాగానే వైద్యశాలను స్పందించి తగు చికిత్సలు చేయించుకుంటే ఇబ్బందులు వుండ వన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని, జ్వరం రాగానే చికిత్సలు చేయించుకోవాలన్నారు. ప్రజలకు దీనిపై పూర్తి అవగాహనకల్గివుండాలన్నారు.కార్యక్రమంలో తహసీల్దార్ బి.విరమణారావు, వైద్యాధికారి మౌనిక, ఏపీవో వెంకటేశ్వర్లు, విఆర్వో నాగలక్షి, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
