బేగంపేట డిసెంబర్ 10,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ నాగిళ్ల టవర్స్ వీధి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి అన్నారు.నాగిల్ల టవర్స్ వీధిలో సిసి రోడ్డు నిర్మాణం ,వీధి లైట్స్ ఇతర సదుపాయాల గురించి స్థానికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ మహేశ్వరి మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికోసం తాను నిత్యం అందుబాటులో ఉండి కృషి చేస్తున్నానన్నారు. సంబంధిత అధికారులతో అక్కడి నుంచే ఫోన్ లో మాట్లాడి సమస్యలను వివరించారు. స్థానికులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకు వచ్చారు.వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.కాలనీ వాసులు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ కృష్ణమాచారి సాయి నిలయం అడపల్లి శ్రీనివాస్,శర్మ, కెనన్ మూర్తి, కిరీటి ఆచార్య, విశాల్, కె. శేష పని, యశోద, కాంచన నజియా సుల్తానా, జిహెచ్ఎంసి మరియు ఎలక్ట్రిసిటీ సిబ్బంది పాల్గొన్నారు

